News September 11, 2025

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకం

image

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ దేవాదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎం హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. వీరిలో సభ్యునిగా బాధ్యత తీసుకోని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు స్థానంలో తాజాగా సుదర్శన్ వేణును నియమించారు. సభ్యుడి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే సుదర్శన్ వేణు పదవిలో ఉంటారని పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

image

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

News September 11, 2025

NRPT: మహిళల రక్షణే షి టీమ్ ప్రధాన లక్ష్యం

image

మహిళలకు రక్షణ కల్పించేందుకే షి టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం తెలిపారు. ఎక్కడ ఆకతాయిల నుంచి మహిళలకు, విద్యార్థినులకు వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. నేరుగా లేదా 87126 70398 ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

News September 11, 2025

సిద్దిపేట: హెపటైటిస్ వాక్సిన్ వేసుకోవాలి: DMHO

image

మూడు డోసుల్లో హెపటైటిస్ బీ వాక్సిన్ వేసుకోవాలి సిద్దిపేట DMHO ధనరాజ్ సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెపటైటిస్ బీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి హెపటైటిస్ టీకాలను వేశారు. జిల్లాలో మొదటి విడతగా హెపటైటిస్ వాక్సిన్ వేస్తున్నామన్నారు.