News October 30, 2024

TTD మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కోరుకుంటున్నా: MP శబరి

image

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన ఛైర్మన్‌గా TV5 అధినేత బీఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు నంద్యాల MP డా.బైరెడ్డి శబరి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో TTD మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా MP శబరి ‘X’లో పేర్కొన్నారు.

Similar News

News February 22, 2026

కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

image

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.

News February 21, 2026

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

image

గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఎస్ఎస్వీ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఒక కాలనీలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి చిన్నారి మృతిచెందింది. బోయరేవుల శ్రీదేవి-గోపాల్ దంపతుల కుమార్తె విజయలక్ష్మి(5) ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం వలస వెళ్లగా చిన్నారి అవ్వతాతల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి నీటి తొట్టిలో పడి మరణించింది.

News February 21, 2026

కర్నూలు: ‘పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసేయాలి’

image

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.