News October 31, 2024

TTD బోర్డులో జనసేన కోటా నుంచి ముగ్గురికి చోటు

image

జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.

Similar News

News October 31, 2024

రేపు ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ ప్రారంభం

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అర్హులకు అందనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అందజేయనుంది. కాగా ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.

News October 31, 2024

IPLతో అత్యధికంగా ఆర్జించింది వీరే

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL ద్వారా ఇప్పటివరకు రూ.194.6 కోట్లు సంపాదించారు. టోర్నీ చరిత్రలో హిట్ మ్యాన్‌దే అత్యధిక ఆర్జన. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (రూ.188.84 కోట్లు), విరాట్ కోహ్లీ (188.2 కోట్లు), రవీంద్ర జడేజా (125.01 కోట్లు), సునీల్ నరైన్ (113.25 కోట్లు) ఉన్నారు. సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువరాజ్ సింగ్ కూడా అత్యధికంగా ఆర్జించారు.

News October 31, 2024

ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

image

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.