News December 20, 2024

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ TTD క్యాలెండర్లు

image

తిరుమల శ్రీవారి భక్తుల కోసం క్యాలెండర్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ TTD అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులోని TTD పబ్లికేషన్ స్టాళ్లు, ప్రధాన కళ్యాణ మండపాల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంటాయని TTD తెలిపింది. తమ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే పంపిస్తామని పేర్కొంది.

Similar News

News September 21, 2025

13,217పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు

image

<>IBPS <<>>గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: SC/ST/ PwBD ₹175,ఇతరులు : ₹850. వెబ్‌సైట్: www.ibps.in

News September 21, 2025

ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

image

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

News September 21, 2025

పూలు పులకరించే సమయం

image

దేవతలకు పుష్పార్చన చేయడం సర్వసాధారణం. కానీ ఆ పూవులనే దేవతలుగా కొలచి ఆరాధించే అదృష్టం ‘బతుకమ్మ’ ద్వారా మనకు దక్కింది. ఈ లోకంలో పూలను పూజించే ఏకైక పండుగ ఇదే. ప్రకృతితో మమేకమై, పూల పవిత్రతను ఆరాధించే ఈ ఆచారం మన ఆధ్యాత్మిక అనుబంధానికి ఓ తార్కాణం. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. పూజలో వాడిన పూలే ఎంతో పులకరిస్తాయంటే.. పూజలందుకొని గంగమ్మను చేరే తంగేడు, గునుగు వంటి పూలు ఇంకెంత పరవశించునో కదా!