News January 9, 2025

సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరుగుతున్న ఈ భేటీలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు పాల్గొన్నారు.

Similar News

News February 4, 2026

మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

News February 4, 2026

చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

image

ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్‌ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.

News February 4, 2026

U19 WC: భారత్ రికార్డు

image

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.