News January 4, 2025
శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి

AP: వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని.. 10,11,12వ తేదీల్లోనే స్వామిని దర్శించుకోవాలని అనుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోవద్దని సూచించారు. VIPలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News November 17, 2025
66 ఏళ్ల రికార్డు.. ఇండియాలో ఫస్ట్ టైమ్ నమోదు!

నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు అనూహ్య <<18303459>>ఓటమి<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కొత్త రికార్డు నమోదైంది. భారత్లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సులు పూర్తయి కనీసం ఒక్కదాంట్లోనూ 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్గా టెస్టుల్లో 12 సార్లు ఇలా జరిగింది. చివరిసారిగా 66 ఏళ్ల క్రితం ఈ తరహా రికార్డు నమోదైంది.

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.