News January 17, 2025

చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD

image

AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News November 1, 2025

బిహార్‌లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే: JVC సర్వే

image

బిహార్‌లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ NDA, MGBల మధ్య వార్ నువ్వానేనా అన్నట్లు నడుస్తోంది. ఈ తరుణంలో ఏది గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతుందని JVC సర్వే చెబుతోంది. 243 సీట్లలో NDAకు 120-140 మధ్య సీట్లు రావచ్చంది. MGBకి 93-112 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే CM అభ్యర్థిగా తేజస్వీకి 33%, నితీశ్‌కు 29% మంది మద్దతు తెలిపారు. ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ 3వ ప్లేస్‌లో ఉన్నారు.

News November 1, 2025

ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

image

AP: మొంథా తుఫాను రైతుల పాలిట మహావిపత్తు అని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. తుఫాన్ ప్రభావంతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నారు.

News November 1, 2025

107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

AP: విజయవాడలో ఉన్న ఆయుష్ విభాగంలో 107 ఉద్యోగాల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంకామ్, MBA, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS పాసవ్వడంతోపాటు APMCలో రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/