News December 28, 2024
TG ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్‌న్యూస్
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తుండటంతో టీటీడీ స్పందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 28, 2024
తప్పు చేస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కొల్లు రవీంద్ర
AP: తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరిపైనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘పేర్ని నాని తప్పు చేయకపోతే నెలరోజులు ఎక్కడికి పారిపోయారు. భార్యను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. నాని తప్పు చేయనిది హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఆయన మేనేజర్ ఎక్కడికి పారిపోయారు’ అని మంత్రి ఫైర్ అయ్యారు.
News December 28, 2024
నితీశ్ సెంచరీ.. ఏడ్చేసిన రవిశాస్త్రి
మెల్బోర్న్ టెస్టులో టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే ఆయన కామెంట్రీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రవి శాస్త్రిని అభినందిస్తున్నారు. యంగ్ ప్లేయర్లను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని అంటున్నారు.
News December 28, 2024
EMI ఆలస్యమవుతోందా.. ఇలా చేయండి..!
కొన్ని సార్లు తీసుకున్న లోన్‌కు EMI కట్టడం ఆలస్యం అవుతుంటుంది. అలాంటి సమయంలో కొన్ని మార్గాలు పాటించాలి. సరైన సమయానికి లోన్ చెల్లించలేకపోతే వెంటనే బ్యాంకుకు తెలపాలి. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ పరిస్థితి చెప్పాలి. EMI తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పెంచుకోవాలి. పెనాల్టీ పడితే దానిని మాఫీ చేయమని బ్యాంకును కోరాలి. మరో లోన్ తీసుకుని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. లోన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు.