News January 26, 2025
ఈ నెల 31న టీటీడీ పాలకమండలి భేటీ

AP: టీటీడీ పాలకమండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు.
Similar News
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
News December 5, 2025
భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

ఇండిగో విమానాలు <<18473431>>రద్దు<<>> కావడంతో మిగతా ఎయిర్లైన్స్ ఈ సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వివిధ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రేట్ రూ.40వేలకు చేరింది. హైదరాబాద్-ముంబైకి రూ.37వేలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్ల టికెట్ ధరలు రూ.6000-7000 మధ్య ఉంటాయి. అటు ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
News December 5, 2025
డబ్బులు రీఫండ్ చేస్తాం: IndiGo

విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య టికెట్ బుక్ చేసుకొని, రద్దు లేదా రీషెడ్యూల్ చేసుకున్నవారికి ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. ఎయిర్పోర్టుల్లో ఉన్నవారందరినీ సేఫ్గా చూసుకుంటామని, ఇబ్బందిపడుతున్న వారికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. వేల సంఖ్యలో హోటల్ గదులు, రవాణా, ఫుడ్, స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.


