News September 6, 2024
హైదరాబాద్ వాసులకు టీటీడీ గుడ్ న్యూస్

TG: హైదరాబాద్‌లో నివసించే శ్రీవారి భక్తులకు TTD శుభవార్త చెప్పింది. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయంలో ఇకపై ప్రతిరోజూ లడ్డూలు అందించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో లడ్డూను రూ.50కే విక్రయించనున్నట్లు పేర్కొంది. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD తెలిపింది. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు.
Similar News
News January 11, 2026
సొరకాయ జ్యూస్ తాగుతున్నారా?

సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్త అవసరమని ICMR హెచ్చరించింది. ఇటీవల చేదుగా ఉన్న జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, UPలో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిపుణులు పరిశీలించి టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల వల్లే సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ విషానికి ప్రత్యేకంగా విరుగుడు లేదని తెలిపారు. దీంతో ఎక్కువ చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగకూడదని అధికారులు సూచించారు.
News January 11, 2026
పురుగు మందుల పిచికారీ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పురుగు మందులను పంటపై పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ముక్కు, కండ్లకు మందు తాకకుండా హెల్మెట్ లాంటిది తప్పనిసరిగా ధరించాలి. మందును కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో నీళ్లు తాగడం, బీడీ, సిగరెట్ కాల్చకూడదు. పురుగు మందుల పిచికారీ తర్వాత స్నానం చేశాకే తినాలి. మందును గాలి వీచే వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. సాధ్యమైనంత వరకు గాలి, ఎండ ఉన్న సమయంలోనే స్ప్రే చేయడం మంచిది.
News January 11, 2026
కలుపు తీయని పైరు కర్ర చేయదు

పొలంలో కలుపును రైతులు సరైన సమయంలో గుర్తించి తొలగించకపోతే పంటకు అందాల్సిన పోషకాలను ఆ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీని వల్ల పైరులో ఎదుగుదల లోపిస్తుంది. ఫలితంగా సరిగా గింజ పట్టదు లేదా బలమైన ‘కర్ర’ (కాండం)గా ఎదగదు. అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలన్నా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న అనవసరమైన విషయాలను, లోపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని ముందుకు సాగాలని ఈ సామెత తెలియజేస్తుంది.


