News July 16, 2024
TTD JEOగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై ఏపీలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
Similar News
News December 1, 2024
మహిళ ప్రాణాలను కాపాడిన తిరుపతి పోలీసులు
కుటుంబ సమస్యలతో తన భార్య తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిందని వినుకొండకు చెందిన ఓ వ్యక్తి తిరుపతి ఎస్పీకి ఫోన్ చేసి వివరించారు. వెంటనే SP సుబ్బారాయుడు ఆదేశాలతో సిబ్బంది ఆమె ఫొటోతో విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. చివరికి ప్లాట్ఫామ్ ట్రాక్ వద్ద ఆమెను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బందిని SP అభినందించారు.
News December 1, 2024
మదనపల్లె MLAపై మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన MRO
మదనపల్లె MLA షాజహాన్ బాషా తనను బెదిరిస్తున్నారంటూ MRO ఖాజాబీ మంత్రి లోకేశ్‌కు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె మంత్రి వద్ద వాపోయారు. తన విధుల విషయంలో జోక్యం చేసుకుని బెదిరిస్తున్నాడరన్నారు. తనకు ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఒత్తిడులు లేకుండా విధులు నిర్వర్తించేలా చూడాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
News November 30, 2024
శ్రీకాళహస్తిలో దారుణ హత్య
శ్రీకాళహస్తి రూరల్ మండలం చిన్నమిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ ఒటి గుంట సెంటర్లో ఓ వ్యక్తి శనివారం హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం K.వెంకటాపురం గ్రామానికి చెందిన గుండుగారి రవి (30)ని ఒటిగుంటకు చెందిన ఆర్ముగం (38) శనివారం కత్తితో నరికి హత్య చేశాడు. రూరల్ సీఐ రవి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.