News July 16, 2024
TTD JEOగా వెంకయ్యచౌదరి

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై ఏపీలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
Similar News
News December 29, 2025
26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.
News December 29, 2025
OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.
News December 29, 2025
చిత్తూరు: ఒకే రోజు రూ.1.25 కోట్ల వసూలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చిందని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు.


