News April 10, 2025

ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి టీటీడీ లడ్డూలు

image

AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం రేపు సాయంత్రం 6.30 గంటల నుంచి కన్నులపండువగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం టీటీడీ 70వేల లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో సేవకులు ఈ లడ్డూల ప్యాకింగ్ పూర్తి చేశారు. రేపు కళ్యాణం అనంతరం భక్తులకు వీటిని పంచిపెట్టనున్నారు.

Similar News

News April 18, 2025

IAS స్మిత సభర్వాల్ తగ్గేదేలే..!

image

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీట్వీట్ చేసి నోటీసులు అందుకున్న సీనియర్ IAS ఆఫీసర్ స్మిత సభర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఎక్స్‌లో రెండు మూడు పోస్టులను ఆమె రీట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన ఓ పోస్టును స్మిత రీట్వీట్ చేశారు. ఈ పోస్టుల్లోనూ AIతో క్రియేట్ చేసిన నెమళ్లు, బుల్డోజర్లు ఉండటం విశేషం.

News April 18, 2025

పార్లమెంట్ హాజరులో MPలు కలిశెట్టి, హరీశ్ టాప్

image

AP: 18వ పార్లమెంట్ సమావేశాలకు TDP MPలు కలిశెట్టి అప్పలనాయుడు, GM హరీశ్ 99 శాతం హాజరై టాప్‌లో నిలిచారు. వైజాగ్ MP శ్రీభరత్ (97), చిత్తూరు MP ప్రసాద్ (93) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తక్కువ హాజరుతో YCP MP అవినాశ్ (54) చివరి స్థానంలో ఉన్నారు. ప్రశ్నలు సంధించడంలోనూ కలిశెట్టి ముందున్నారు. ఆయన మొత్తం 89 ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మాగుంట (84) ఉన్నారు. జనసేన MP తంగెళ్ల ఉదయ్ తక్కువగా 22 ప్రశ్నలే అడిగారు.

News April 18, 2025

డేల్ స్టెయిన్ ‘300’ కామెంట్లపై ముంబై సెటైర్!

image

IPLలో ముంబైతో జరిగే మ్యాచులో SRH 300 స్కోర్ కొడుతుందన్న సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ <<16106276>>డేల్ స్టెయిన్<<>> వ్యాఖ్యలకు ముంబై ఇండియన్స్ కౌంటరిచ్చింది. ‘డేల్ స్టెయిన్ చెప్పినట్లే ఎగ్జాక్ట్‌గా 328 పరుగులు వచ్చాయి. (రెండు జట్లు కలిపి చేసిన స్కోరు)’ అంటూ Xలో సెటైర్ వేసింది. కాగా SRH 300 ఎప్పుడు కొడుతుందా అన్న నెటిజన్ల చర్చపై గతంలో స్టెయిన్ స్పందించారు. MIతో జరిగే మ్యాచులోనే ఈ ఫీట్ నమోదవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

error: Content is protected !!