News September 22, 2024
సీఎం వద్దకు చేరిన టీటీడీ నివేదిక

AP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక ఇచ్చారు. ప్రాథమిక నివేదికపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను సీఎంకు ఈవో వివరించారు. రేపు దీనిపై మరిన్ని వివరాలు అందిస్తామని ఈవో చెప్పారు.
Similar News
News November 17, 2025
మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్‌పై SC ఆగ్రహం

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.
News November 17, 2025
OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

AP: ఈ నెల 19న పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.
News November 17, 2025
‘అన్నదాత సుఖీభవ’.. అచ్చెన్న కీలక ఆదేశాలు

AP: ఈ నెల 19న <<18310567>>అన్నదాత సుఖీభవ<<>> పథకం అమలు నేపథ్యంలో అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. NPCIలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్‌కు అర్హత ఉన్న వారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలి’ అని సూచించారు.


