News January 27, 2025
TTD Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 22, 2025
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమేనా?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్లో బ్యానర్ కూడా పెట్టేశారు.
News November 22, 2025
వందల మందిని కాపాడే ఏఐ పరికరం.. అభినందించాల్సిందే!

హిమాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎంతో మంది చనిపోతుంటారు. అలాంటి ప్రమాద మరణాలను తగ్గించేందుకు IIT మండికి చెందిన డా.కళా వెంకట ఉదయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో AI వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది 90% పైగా కచ్చితత్వంతో 3 గంటల ముందుగానే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. దీని సెన్సార్లు భూమి కదలిక, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి ప్రమాదానికి ముందు అలర్ట్ చేస్తుంది.
News November 22, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్సైట్: cdri.res.in


