News March 5, 2025

TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

image

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.

Similar News

News April 3, 2026

మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

image

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.

News April 3, 2026

ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర

News April 3, 2026

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.