News April 11, 2024
TTD విజిలెన్స్ అదుపులో నకిలీ ఐఏఎస్ అధికారి
తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 23, 2024
CTR: ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని హాస్పిటల్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్-03, ఫిమేల్ నర్సింగ్-07, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్-06 మొత్తం 16 ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 27 అని పేర్కొన్నారు.
News December 22, 2024
చిత్తూరు: ఈ లెటర్ మీ ఇంటికి వచ్చిందా.. జాగ్రత్త
చిత్తూరు జిల్లాలో సైబర్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం మోసాలనే చూశాం. ఇది వాటికి మించినది. సైబర్ నేరగాళ్లు మీ ఇంటి ముందు ఓ ప్రముఖ కొరియర్ ఫాం పడేసి డెలివరి డేట్ మార్చాలనో లేదా అడ్రస్ మార్చాలనో అడుగుతారు. పొరపాటున మీరు ఫాంపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేశారో అంతే సంగతులు. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయం. ఇలాంటి వాటిపై తస్మాస్ జాగ్రత్త.
News December 22, 2024
మదనపల్లె: డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీ
SVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో యథ్చేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మదనపల్లెలో కొన్ని కాలేజీలలో యాజమాన్యాలు సీపీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ పరీక్షలు రాయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై SVU పరీక్షల నియంత్రణ అధికారి కిశోర్‌ను వివరణ కోరగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.