News February 3, 2025
టీటీడీ కీలక నిర్ణయం

AP: ఇకపై ప్రతి నెలా చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.
Similar News
News March 23, 2026
అసలైన ‘ధురంధర్’.. రవీంద్ర కౌశిక్(1/2)

‘ధురంధర్-2’ హిట్టైన నేపథ్యంలో రియల్ లైఫ్ ‘ధురంధర్’ రవీంద్ర కౌశిక్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈయన కేవలం 23 ఏళ్ల వయసులోనే RAW ఏజెంట్‌గా ఎంపికై.. ‘నబీ అహ్మద్ షకీర్’ పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లారు. అక్కడ LLB పూర్తిచేసి పాక్ సైన్యంలో ఉద్యోగం పొంది మేజర్ స్థాయికి ఎదిగారు. 1979-1983మధ్య పాక్ సైన్యంలోని రహస్యాలు, అణ్వాయుధ కార్యక్రమ సమాచారాన్ని భారత్‌కు చేరవేసేవారు.
News March 23, 2026
రవీంద్ర కౌశిక్ అలియాస్ బ్లాక్ టైగర్ (2/2)

పాక్ సైన్యంలో ఉంటూ రవీంద్ర అందించిన సమాచారంతో శత్రువుల అనేక యుద్ధ ప్రణాళికలను భారత్ తిప్పికొట్టింది. అందుకే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ బిరుదు ఇచ్చారు. జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల 1983లో ఆయన పాక్ అధికారులకు చిక్కారు. 16ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించి 2001లో అక్కడే కన్నుమూశారు. ‘ధురంధర్ 2’ రిలీజ్ నేపథ్యంలో ఈ వీరుడి త్యాగాన్ని అంతా గుర్తుచేసుకుంటున్నారు.
News March 23, 2026
శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి?

చైత్ర శుద్ధ నవమి రెండు తేదీల్లో ఉండటంతో భక్తుల్లో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం నెలకొంది. ఈసారి నవమి మార్చి 26న 2.18pmకు ప్రారంభమై 27వ తేదీ 12.36pm వరకు ఉంది. సూర్యోదయ సమయంలో నవమి ఉండే రోజున పండగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే MAR 27, శుక్రవారం శ్రీరామనవమి జరుపుకోవాలని సూచిస్తున్నారు. భద్రాచలం రాములోరి కళ్యాణం కూడా అదే రోజున జరగనుంది.


