News September 21, 2024

లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం

image

AP: లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.

Similar News

News September 21, 2024

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లకు కేరళకు సంబంధం ఏంటి?

image

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల ఘటనలో కేర‌ళ‌లో పుట్టిన, నార్వే సిటిజ‌న్ రిన్స‌న్ జోస్‌(36) పేరు వినిపించింది. బల్గేరియాకు చెందిన నార్టా గ్లోబల్ కంపెనీకి జోస్ యజమాని. పేజర్‌లను తైవానీస్ సంస్థ గోల్డ్ అపోలో ట్రేడ్‌మార్క్‌తో BAC కన్సల్టింగ్ అనే హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. అయితే వాటిని జోస్ సంస్థ ద్వారా కొనుగోలు చేశార‌నే వార్త‌లొచ్చాయి. బ‌ల్గేరియా జాతీయ భ‌ద్ర‌త ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది.

News September 21, 2024

‘యథా రాజా తథా పోలీసులు’.. రాష్ట్రంలో పరిస్థితి ఇదే: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో కొందరు పోలీసుల పనితీరు ‘యథా రాజా తథా పోలీసులు’ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గత పదేళ్లలో కేసీఆర్, సీనియర్ అధికారులతో కలిసి పోలీసింగ్ విభాగాన్ని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దారని ట్వీట్ చేశారు. కొందరి తీరు వల్ల రాష్ట్ర పోలీస్ బ్రాండ్‌కు అవినీతి మరక పడితే సీనియర్ అధికారుల కష్టం వృథా అవుతుందన్నారు. దీనిపై అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు.

News September 21, 2024

తిరుమలలో అలా జరగడం ఘోరం, నికృష్టం: మోహన్ బాబు

image

‘తిరుమల లడ్డూ’ వివాదంపై నటుడు మోహన్‌బాబు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా వర్సిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని నాతో పాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ నిత్యం భక్తితో నమస్కరిస్తుంటాం. అక్కడ ఇలా జరగడం ఘోరాతి ఘోరం, నికృష్టం, హేయం, అరాచకం. నేరస్థుల్ని శిక్షించాలని నా మిత్రుడు, AP CM చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు.