News March 5, 2025
TU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డిచ్పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. మొత్తం విద్యార్థులు 19574 మంది పరీక్షలకు హాజరుకాగా 6436 మంది (32.88%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 14.58% కాగా బాలికలు 42.83% ఉత్తీర్ణులయ్యారు.
Similar News
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్గా నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.

కామారెడ్డి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామినేషన్లో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో పరీక్ష ఫీజు ₹100, హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజు ₹150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్లో ₹150, హయ్యర్ గ్రేడ్లో ₹200 చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEC 20లోపు DEO ఆఫీసులో సమర్పించాలని పేర్కొన్నారు.