News March 5, 2025

TU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. మొత్తం విద్యార్థులు 19574 మంది పరీక్షలకు హాజరుకాగా 6436 మంది (32.88%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 14.58% కాగా బాలికలు 42.83% ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News March 27, 2025

జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

image

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.

News March 27, 2025

హుజూరాబాద్ : రేషన్‌లో సన్నబియ్యం.. బియ్యం అక్రమ రవాణాకు చెక్

image

రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రేషన్‌కార్డు దారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేది. అయితే చాలామంది లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడక అక్రమ వ్యాపారులకు అమ్ముకునే వారు. అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనుండటంతో లబ్ధిదారులు వాటిని వాడుకునే అవకాశం ఉంది. దీంతో బియ్యం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు చెక్ పెట్టినట్లు కానుంది.

News March 27, 2025

సిద్దిపేట: తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోహెడ (M) రాంచంద్రపూర్‌కు చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపారి. ప్రశాంత్(19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ 21న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు KNR ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

error: Content is protected !!