News February 14, 2026

TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

image

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.

Similar News

News March 9, 2026

బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

image

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.

News March 9, 2026

కాకినాడ: కొండల్లో రక్తపుమడుగులో బాలుడి మృతదేహం

image

అనకాపల్లి(D) ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపుమడుగులో <<19331621>>బాలుడు కౌసిక్ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. CI ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తోటి బాలురను విచారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతిచెందడం గమనార్హం.

News March 9, 2026

పెంట్లవెల్లి మండలంలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలంలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తాడూర్ మండలంలో 38.3°C, కల్వకుర్తి మండలంలో 38.1°C, తిమ్మాజిపేట మండలంలో 37.6°C, అచ్చంపేట మండలంలో 37.4°C, ఊర్కొండ మండలంలో 37.2, పెద్దకొత్తపల్లి 37.1°C, వెల్దండ 36.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ప్రజలు ఎండతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.