News February 26, 2026
TU: ప్రారంభమైన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో పటిష్ఠమైన భద్రత, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 14, 2026
ప్లీజ్.. పిల్లల ముందు గొడవలొద్దు!

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం గొడవ పడొద్దు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల మనసును బాధిస్తుంది. మరికొందరు నైబర్స్‌తో ఘర్షణకు దిగుతారు. అలాంటి సందర్భాల్లోనూ పిల్లలు భయానికి గురవుతారు. ఇది వారిలో అభద్రతాభావానికి దారి తీస్తుంది. భవిష్యత్తులో వారూ చెడు మాటలు మాట్లాడటం, పెరిగి పెద్దయ్యే క్రమంలో గొడవలకు దిగే ప్రమాదం ఉంటుంది.
News April 14, 2026
విద్యార్థి కాళ్లకు సంకెళ్లు వేసిన టీచర్

బనగానపల్లెలో సోమవారం అమానుష ఘటన జరిగింది. ఓ పాఠశాల విద్యార్థి అల్లరి చేశాడనే నెపంతో ఉపాధ్యాయుడు బాలుడి కాలికి ఇనుప గొలుసులతో చెక్కమొద్దును కట్టారు. ఆ సంకెళ్లతోనే బాలుడు రోడ్డుపైకి రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన టీచర్‌ను పోలీసులు మందలించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.


