News February 13, 2026
TU: ముగిసిన ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాలు

తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 4 ఆధ్వర్యంలో సుద్దపల్లి, వెస్లీ తండాలో నిర్వహించిన శీతాకాల శిబిరాలు శుక్రవారం ముగిసినట్లు ప్రోగ్రాం అధికారులు తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ మాట్లాడుతూ.. వాలంటీర్లు అందరూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారన్నారు. చెత్తాచెదారం, డ్రైనేజీ నిర్వహణపై సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలపై వివరించారన్నారు.
Similar News
News March 15, 2026
విశాఖలో చికెన్ రూ.310

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.
News March 15, 2026
భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు: కలెక్టర్

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక (2025-26) కింద జిల్లాకు 190 బ్యాంకు సంబంధిత యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రూ.382 లక్షలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 15, 2026
హిందూపురంలో నేడు జాబ్ మేళా

హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.


