News July 19, 2024

TU: సాంబారులో పురుగు.. రిజిస్ట్రార్ చర్యలు

image

గర్ల్స్ హాస్టల్లో సాంబారులో పురుగు ఘటనపై టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి చర్యలు చేపట్టారు. ఈ మేరకు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ మేరకు కమిటీ విచారణ జరిపి ఘటనకు గల కారణాలను తెలుసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేర్ టేకర్ల 24గం.ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పర్యవేక్షణా నిమిత్తం ఐదుగురు మహిళా ఆచార్యులతో కమిటీని నియమించారు.

Similar News

News February 8, 2025

NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.

News February 7, 2025

NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.

News February 7, 2025

NZB: ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష

image

మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. నగరంలో నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 17 మందిని శుక్రవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు ప్రవేశపెట్టగా అందులో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. మిగిలిన 11 మందికి రూ.15,500 జరిమానా విధించారన్నారు.

error: Content is protected !!