News September 19, 2025

TU: అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర ప్రతిష్టాత్మకమైనది: రిజిస్ట్రార్

image

అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకమైనదని టీయూ రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరి అన్నారు. శుక్రవారం వర్సిటీ న్యాయ కళాశాలలో డా.జట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో ‘United States Immigration System And Privte International Law’ అనే అంశంపై విస్తృత ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.శ్రీనివాస్ రావు కావేటి, డా.ఉత్తం, లా కాలేజ్ ప్రిన్సిపల్ డా.ప్రసన్న రాణి పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

TU: క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపును తేవాలి: రిజిస్ట్రార్

image

టీయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ (పురుషుల) ఎంపిక పోటీలను శుక్రవారం ప్రారంభించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొ.యం.యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వర్సిటీలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే.. సౌకర్యాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రవీణ్, డా.పున్నయ్య పాల్గొన్నారు.

News September 19, 2025

SRSP UPDATE: 27 వరద గేట్ల మూసివేత.. 12 ఓపెన్

image

నిన్నటి వరకు SRSP 39 వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో శుక్రవారం 27 వరద గేట్లను మూసివేశారు. 12 గేట్లను తెరిచి ఉంచి 35,293 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,61,251 క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 51,560 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో తాజాగా 78.572 TMCల నీటిమట్టం ఉంది.

News September 19, 2025

NZB: టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: TPCC చీఫ్

image

టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం NZBలో నిర్వహించిన టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌ బెస్ట్‌ టీచర్ అవార్డ్స్-2025 పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లడారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, హెల్త్‌ కార్డు అమలు, స్కిల్‌ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కళాశాలలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.