News August 14, 2025

TU: ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది విద్యార్థుల రిపోర్ట్

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలకు 81 మంది విద్యార్థులను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎప్‌సెట్ ద్వారా కేటాయించారు. సీఎస్‌ఈలో 65 మందికి గాను 61, CSE(AI)లో 9 మందికి ఏడుగురు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముగ్గురు, డాటా సైన్స్‌లో ముగ్గురు విద్యార్థులు రిపోర్ట్ చేసి అడ్మిషన్లు తీసుకున్నారని ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి తెలిపారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని స్పష్టం చేశారు.

Similar News

News August 16, 2025

GNT: మార్ఫింగ్ ఫొటోల బెదిరింపులు.. యువకుడిపై కేసు నమోదు

image

ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. సుందర్ అనే యువకుడు మల్లిఖార్జునపేటకు చెందిన ఇంటర్ విద్యార్థినితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేకుంటే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News August 16, 2025

NRPT: 20న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

NRPTలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో పాల్గొనేందుకు ఈనెల 20న బాల,బాలికలకు అండర్-14, 16,18,20 ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ Way2Newsతో తెలిపారు. U-14(15-10-2011/14-10-2023), U-16(15-10-2009/14-10-2011), U-18(15-10-2007/14-10-2009), U-20(15-10-2005/14-10-2007) మధ్య జన్మించి ఉండాలని, పూర్తి వివరాలకు 91007 53683,90593 25183 సంప్రదించాలన్నారు.

News August 16, 2025

బాపట్ల యువకుడికి టాప్ ర్యాంక్.. సబ్ DFO పోస్ట్

image

బాపట్లలోని పాండురంగ పేటకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో టాప్-1 ర్యాంక్ సాధించారు. శిక్షణ పూర్తి కావడంతో ఏపీ కేడర్‌‌ కింద ఆయనకు పోస్టింగ్ కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా వెంకట శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.