News October 15, 2025

TU: ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవి

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవిని నియస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొ.టి.యాదగిరి రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి అందజేశారు. మహ్మద్ అబ్దుల్ ఖవి మైనారిటీ సెల్ డైరెక్టర్, ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఉర్దూ అరబిక్ తదితర పోస్టుల్లో తనదైన ముద్ర వేశారు.

Similar News

News October 16, 2025

ఆమెకు 1400 మరణశిక్షలు విధించాలి!

image

బంగ్లా మాజీ PM షేక్ హసీనాకు 1,400 మరణశిక్షలు విధించాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో ఆ దేశ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ వాదించారు. కనీసం ఒక్క మరణశిక్షైనా విధించకపోతే అన్యాయమేనన్నారు. అక్కడ గతేడాది JUL-AUGలో జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు హసీనే కారణమని బంగ్లా ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

News October 16, 2025

డిజిటల్ నైపుణ్యానికి వేదికగా ఫ్రమ్ నూజివీడు ఉయ్ లీడ్

image

డిజిటల్ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు చక్కని వేదికగా ఫ్రమ్ నూజివీడు ఉయ్ లీడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. నూజివీడులో సబ్ కలెక్టర్ గురువారం రాత్రి మాట్లాడారు. సోషల్ మీడియా, క్రియేటర్స్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వేదికను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ ప్రతిభ ప్రదర్శించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

News October 16, 2025

కల్వకుర్తి: గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆర్డీవో తనిఖీ

image

కల్వకుర్తి పట్టణంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల లోపం, వంట వర్కర్ల సమ్మె కారణంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బుధవారం ఆర్డీవో జనార్దన్, జిల్లా డీటీడీవో పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల సమస్యలను ఆరా తీసిన అధికారులు, వెంటనే ఫ్యాన్లు, లైట్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.