News October 11, 2025
TU: ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా ఆచార్య అపర్ణ

తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా ఆచార్య అపర్ణను టీయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆమెకు నియామక పత్రం అందజేశారు. టీయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆమె పలు అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వర్తించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా నియమించడం పట్ల వీసీ, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 11, 2025
విజయవాడ: నూతన డాగ్ కెనాల్స్ ప్రారంభం

పోలీసు కమిషనరేట్ పరిధిలో VIP భద్రత, నార్కోటిక్స్, నేర పరిశోధనల కోసం శిక్షణ పొందిన డాగ్లను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనెల్స్‌ను పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. శిక్షణ పొందిన డాగ్‌లు స్వాగతం పలికి, మెళుకువలు ప్రదర్శించాయి. డీసీపీలు కె.జి.వి. సరిత, కె. తిరుమలేశ్వర రెడ్డి, ఏ.బి.టి.ఎస్. ఉదయ రాణి, ఇతర అధికారులు హాజరయ్యారు.
News October 11, 2025
ప్రజా పాలనలో గ్రామాలు దూసుకెళ్తున్నాయ్: పొంగులేటి

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
News October 11, 2025
ADB: హస్తానికి కొత్త సారథి.. ఎవరవుతారో మరి?

జిల్లాలో కాంగ్రెస్‌కు త్వరలో కొత్త సారథి రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని అప్పటి అధ్యక్షుడు సాజీద్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. రెండేళ్లుగా పదవి ఖాళీగానే ఉంది. అందరిని కలుపుకొనిపోయే వాళ్ల కోసం అధిష్ఠానం వెతుకుతోంది. AICC పరిశీలకుడు జిల్లాలో పర్యటించి నివేదిక అందజేయనున్నారు. కంది శ్రీనివాసరెడ్డి, గోక గణేశ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సోయం పేర్లు వినిపిస్తున్నాయి.