News January 7, 2026
TU కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య రాంబాబు

తెలంగాణ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య రాంబాబును టీయూ వీసీ ఆచార్య యాదగిరి రావు నియమించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆచార్య రాంబాబు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, కామర్స్ డీన్, పరీక్షల విభాగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనను నియమించడంపై VC, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 7, 2026
మేకిన్ ఇండియాకు బలం.. ట్రేడ్ డీల్‌పై మోదీ

ఇండియా, US <<19072293>>ఒప్పందం<<>>పై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘2 దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు. ఈ ఫ్రేమ్‌వర్క్ రైతులు, MSMEs, స్టార్టప్‌లు, జాలర్లు, మరెందరికో కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుంది. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుంది. ప్రజలను శక్తిమంతం చేసే ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
News February 7, 2026
రంగారెడ్డి: మున్సిపల్ ‘కుర్చీ’ కోసం.. ఆస్తులు గుల్ల!

ఉమ్మడి RR జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచార పర్వం మొదలవడంతో అభ్యర్థుల ఖర్చు అంచనాలు మించిపోతోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచితీరాలనే సంకల్పంతో అభ్యర్థులు ఎంతైనా వెచ్చించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మెజార్టీ అభ్యర్థులు సంపన్నులే అయినప్పటికీ చేతిలో ఉన్న కొద్దిపాటి నగదు నామినేషన్‌కు ముందే ఖర్చవడంతో నిధుల వేటలో నిమగ్నమయ్యారు. కాగా, కొందరు బంగారం, ప్లాట్లు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
News February 7, 2026
8 వరకు టెమ్రిస్ సీఓఈ ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు

TG మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు (టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ జంగా సతీశ్ తెలిపారు. హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు వద్ద టెమ్రిస్ వరంగల్-1, బాలురకు హనుమకొండ హంటర్ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలల్లో సీఓఈలు ఏర్పాటు చేశామన్నారు.


