News September 10, 2025

TU: కొనసాగుతున్న M.Ed, L.L.B పరీక్షలు

image

టీయూ పరిధిలోని M.Ed, LLB పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్ పరీక్షలకు 37 మందికి 36 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారన్నారు. యూనివర్సిటీలో జరిగిన LLB 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 28 మంది హాజరయ్యారని వెల్లడించారు.

Similar News

News September 10, 2025

అవార్డులు బాధ్యతను పెంచుతాయి: కలెక్టర్

image

అవార్డులు బాధ్యతను పెంచుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం చేసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News September 10, 2025

జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్

image

AP: మెడికల్‌ కాలేజీలపై జగన్‌ <<17624092>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్‌ కాలేజీలు అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అని, ఇందులో పబ్లిక్‌ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. తెలియకపోతే సలహాదారులను అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. PPP వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని తెలిపారు.

News September 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.