News July 6, 2025
TU: జులై 15 వరకు గడువు ఇవ్వాలి: TUSC JAC

టీయూ రెండో స్నాతకోత్సవంలో పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని TUSC JAC పూర్వ అధ్యక్షుడు సత్యం కోరారు. 12 ఏళ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు విద్యార్థులకు కేవలం మూడు రోజుల సమయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జులై 15వరకు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News July 6, 2025
కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
News July 6, 2025
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కేజీ రూ.170 ధర పలుకుతోంది. స్కిన్‌లెస్ కేజీ రూ.200-210 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150 మధ్య ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొంత కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.