News October 26, 2025
TU: డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిగ్రీ (B.A/B.Com/B.Sc/BBA/BCA) 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులు తమ పరీక్షల ఫీజులు చెల్లించడానికి గడువు తేదీ పొడిగింపు చేసినట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నవంబర్ 4వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా సంబంధిత కళాశాలల్లో పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
Similar News
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News October 26, 2025
ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 26, 2025
కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.


