News February 24, 2026

TU: తెలుగు అధ్యయన శాఖ బోర్డర్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.

Similar News

News February 26, 2026

హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

image

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP, TGలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు కురుస్తున్నాయి. వేసవిలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈసారి ముందుగానే పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని IMD వెల్లడించింది. TGలోని రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.