News February 26, 2026
TU: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉపకులపతి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, COE ఆచార్య సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఉపకులపతి అధికారులకు తగిన సూచనలు చేస్తూ, పరీక్షలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2026
సత్యసాయి: ఆమెది హత్యా? ఆత్మహత్యా?

పుట్టపర్తిలోని పెడపల్లిలో వివాహిత చంద్రకళ (22) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతి అనుమానస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు వర్షిత, మోక్షిత ఇరువురు పిల్లలు ఉన్నారు.
News March 1, 2026
VJA: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా యశ్వంత్‌పూర్(YPR)- సంత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06233 YPR- SRC రైలు మార్చి 1న, నం.06234 SRC- YPR రైలు మార్చి 3న ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు హిందూపూర్, అనంతపూర్, నంద్యాల, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News March 1, 2026
ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అంతం చేసినట్లు ట్రంప్ ప్రకటన, మీడియా రిపోర్ట్స్ నేపథ్యంలో US తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి చేస్తున్న ఈ దాడుల్లో కొన్ని వందల అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోగా 700 మందికిపైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 85 మంది బాలికలూ ఉన్నారు. మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో వీరు ప్రాణాలు కోల్పోయారు.


