News April 9, 2025
TU: పరీక్ష ఫీజులకు ఈనెల 15 తుది గడువు

టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్‌ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.
Similar News
News September 12, 2025
ఈనెల 10 నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు పోరాట విశిష్టతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు.
News September 11, 2025
NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News September 11, 2025
NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేటలోని సిరన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ పూర్తి అయినట్లు చెప్పారు.