News September 24, 2025

TU: పీహెచ్డీ ప్రవేశాలకు రేపే చివరి తేదీ

image

తెలంగాణ యూనివర్సిటీలో Ph.Dలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివర తేదీయని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్సెస్, లా విభాగాల్లో జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలన్నారు.

Similar News

News September 24, 2025

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

దసరా పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి దూర ప్రాంతాలకు 480 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలు ఉంటాయన్నారు.

News September 24, 2025

తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, లోకేశ్

image

శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి అతిథిగృహానికి చేరుకున్న సీఎం దంపతులకు ఛైర్మన్ BR నాయుడు స్వాగతం పలికారు. మరికాసేపట్లో వారు బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.

News September 24, 2025

ఆఫర్‌లోనూ ధరలు తగ్గలేదని చర్చ!

image

ఈ కామర్స్ సైట్లు దసరా సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించగా, తొలిరోజు ఉన్న ధరలు ఇప్పుడు లేకపోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ యూజర్ iphone 15plus ఫోన్‌ను బుక్ చేసేందుకు ట్రై చేయగా 23% ఆఫ్‌తో రూ.68,999గా చూపించిందని పేర్కొన్నారు. గతనెలలో ఇదే ఫోన్ రూ.69,499 ఉందని, ఆఫర్ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మీకూ ఇలా జరిగిందా?