News February 23, 2026

TU: ప్రారంభమైన ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు హాజరుకాగా 1(ఒకరు) గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఇటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.

Similar News

News February 24, 2026

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కీలక బాధ్యత

image

భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్‌గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.

News February 24, 2026

ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

image

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.

News February 24, 2026

మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

image

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.