News January 15, 2026
TU ప్రొఫెసర్ గణేష్ అరుదైన ఘనత

TU ఎడ్యుకేషన్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్(PT) బదావత్ గణేష్ అరుదైన గుర్తింపు పొందారు. “టీచర్ ఎడ్యుకేషన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్: NEP 2020 అండ్ ఇట్స్ విజన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్” అనే పుస్తకంలో ఆయన ఒక పాఠాన్ని రచించి ప్రచురించారు. డాక్టర్ టి.విజయ్ కుమార్, డాక్టర్ ఎం.రవిబాబు, డాక్టర్ టి.లింగమూర్తిల మార్గదర్శకత్వంలో ఈ పాఠాన్ని రూపొందించారు. ఆయనకు తోటి అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News February 16, 2026
HYD: మీరూ సింగిల్‌గా ఉన్నారా?

ఒంటరి జీవితంతో యువతలో మానసిక వేదన పెరుగుతోందని కాప్రా డా.సువర్ణ తెలిపారు. గ్రేటర్ పరిధిలో యువతకు 34 ఏళ్లు దాటినా సింగిల్‌గా ఉంటున్నారని తెలిపారు. దీనికి కారణం పెళ్లిళ్లు కాకపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోతున్నారని వివిధ సర్వేల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. యుక్త వయసులో వృత్తి కోర్సులను ఎంచుకోవడం, కుటుంబంతో కలిసి ఉండటం, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని సూచించారు.
News February 16, 2026
NTR జిల్లా కలెక్టరేట్‌కు 145 అర్జీలు

కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 145 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. 62 రెవెన్యూ, 83 రెవెన్యూయేతర అర్జీలు ఉన్నాయన్నారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 16, 2026
ఏపీ నుంచి ఇసుక రవాణాపై ఖమ్మం సీపీ హెచ్చరిక

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలన్నారు. అక్రమ రవాణా, నిల్వలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని తెలిపారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్‌లకు సూచించారు.


