News December 10, 2025

TU: ముగిసిన డిగ్రీ పరీక్షలు.. 11 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.SC/BBA/BCA 1, 3, 5 సెమిస్టర్ల రెగ్యులర్, 2, 4, 6 సెమిస్టర్ల బ్యాక్ లాగ్(2021-25) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగాయని వెల్లడించారు. బుధవారం 11 పరీక్షా కేంద్రాల్లో 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

VJA: భవానీ భక్తుల కోసం ప్రత్యేక లడ్డూ కౌంటర్లు

image

భవానీ దీక్ష విరమణ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలను బాక్సుల్లో అందుబాటులో ఉంచారు. దీక్ష విరమణ తొలిరోజు గురువారం లడ్డూలు కొనుగోలు చేసిన భక్తులతో దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడారు. అధిక మొత్తంలో లడ్డూలు కౌంటర్లలో అందుబాటులో ఉండటం, కావలసినన్ని విక్రయించడంతో భవానీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 11, 2025

ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా విజయలక్ష్మి

image

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

News December 11, 2025

సంగారెడ్డి: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

SBI గ్రామీణ శివం ఉపాధి శిక్షణ కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ గురువారం తెలిపారు. 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల మహిళలు అర్హులని చెప్పారు.