News January 16, 2026
TU: ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’.. ఇంకా 5 రోజులే గడువు

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపుకు ఇంకా 5రోజులే గడువుందని టీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016-2020 మధ్య చేరిన బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ, బి.బి.ఏ విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో ఈనెల 27 వరకు అవకాశం ఉందన్నారు. ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 31, 2026
లడ్డూ కల్తీ.. ఈవో నిర్లక్ష్యమూ కారణం: SIT

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో CBI SIT రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించి నిబంధనల్లో వచ్చిన మార్పులే కల్తీకి కారణమని తేల్చినట్లు పేర్కొంది. అప్పటి, ప్రస్తుత EO అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదు. కానీ ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది.
News January 31, 2026
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News January 31, 2026
మేడారంలో ఎటుచూసినా ‘బంగారమే’!

మేడారం జాతరకు భక్తజన సందోహం పోటెత్తింది. వనదేవతలు గద్దెలపైకి చేరడంతో మొక్కులు చెల్లించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవార్లకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘బంగారం'(బెల్లం) సమర్పించేందుకు బారులు తీరారు. తమ బరువుకు తూగేలా తులాభారం వేసి, ఆ బెల్లాన్ని గద్దెలపై సమర్పిస్తున్నారు. జాతర ప్రాంగణమంతా బంగారు వర్ణపు బెల్లం కుప్పలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మేడారంలో ఎటుచూసినా ‘బంగారమే’ కనిపిస్తోంది.


