News July 19, 2024
TU: సాంబారులో పురుగు.. రిజిస్ట్రార్ చర్యలు

గర్ల్స్ హాస్టల్లో సాంబారులో పురుగు ఘటనపై టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి చర్యలు చేపట్టారు. ఈ మేరకు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ మేరకు కమిటీ విచారణ జరిపి ఘటనకు గల కారణాలను తెలుసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేర్ టేకర్ల 24గం.ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పర్యవేక్షణా నిమిత్తం ఐదుగురు మహిళా ఆచార్యులతో కమిటీని నియమించారు.
Similar News
News August 26, 2025
NZB: కొండెక్కిన పూల ధరలు

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
News August 26, 2025
NZB: ఐటీఐలో స్పాట్ అడ్మిషన్ గడుపు పొడగింపు

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్స్‌లలో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
News August 26, 2025
భీమ్‌గల్: అంకం జ్యోతి ఫౌండేషన్‌కు డాక్టరేట్

భీమ్‌గల్‌కి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్‌కు వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాక్టర్ జ్యోష్ణ, రవి చేతుల మీదుగా ఫౌండేషన్ డైరెక్టర్ జ్యోతి అవార్డ్ అందుకున్నారు. 15 ఏళ్ల నుంచి పేద ప్రజలకు, వృద్ధులకు సహాయం చేస్తూ 3 సార్లు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని జ్యోతి తెలిపారు.