News October 26, 2025

TU: B.Ed, B.P.Ed రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోండి

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని B.Ed, B.P.Ed 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్(2021 బ్యాచ్) విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నవంబర్ 3వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Similar News

News October 26, 2025

నవంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజనం బంద్: సీఐటీయూ

image

మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. బిల్లులు చెల్లించకుంటే నవంబర్‌ 1వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు.

News October 26, 2025

ఏడీసీపీ రవికి డీజీపీ ప్రశంసా పత్రం అందజేత

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో గత ఆగస్టు మొదటి వారంలో నిర్వహించిన రెండో రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతం చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కీలకపాత్ర పోషించారు. దీంతో పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవితో పాటు మరికొందరు పోలీస్ అధికారులకు రాష్ట్ర డీజీపీ జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు.

News October 26, 2025

కళ్యాణదుర్గం: సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువు మృతి

image

కళ్యాణదుర్గంలోని RDT ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనేణేల్లు మండలం వీరాపురానికి చెందిన తులసి నెలలు నిండడంతో 2 రోజుల కిందట RDT ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆడపిల్లకు జన్మనివ్వగా, శిశువు మృతి చెందింది. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.