News August 27, 2025

TU: PG, B.Ed, M.Ed పరీక్షలు వాయిదా

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సంబంధిత కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.

Similar News

News August 27, 2025

SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

image

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News August 27, 2025

ADB: భారీ వర్షాలపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్ష

image

వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

News August 27, 2025

ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

image

AP: మహారాష్ట్ర గవర్నర్, NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి.