News October 25, 2025
TU: Ph.D అడ్మిషన్లకు ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సోషల్ సైన్స్ విభాగంలో చేరబోయే అభ్యర్థులకు శనివారం పీహెచ్డీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య రవీందర్ రెడ్డి తెలిపారు. అప్లైడ్ ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లోని కేటగిరి 1 యూజీసీ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉదయం 10 గం.ల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆయా విభాగాధిపతులు, ఎక్స్టర్నల్స్ పాల్గొననున్నారు.
Similar News
News October 25, 2025
HYD: GHMC డిజిటల్ లైఫ్‌లైన్‌కు బ్రేక్..!

GHMC పరిధిలోని 150 వార్డు ఆఫీస్‌లకు 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ అందించే కీలక కాంట్రాక్టుకు అధికారులు ఎన్నిసార్లు టెండర్ పిలిచినా ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. కేవలం వారంలోపు మొత్తం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే అసాధ్యమైన గడువు వంటి నిబంధనలు sérieux సర్వీస్ ప్రొవైడర్లను దూరంగా ఉంచాయి. దీంతో ఆస్తుల పత్రాలు, పన్ను చెల్లింపులు, దరఖాస్తులు, సర్టిఫికెట్ల జారీ వంటి పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/