News October 30, 2024
అత్యధిక మరణాల్ని కలిగిస్తున్న అంటువ్యాధి క్షయ: WHO

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కొవిడ్-19 స్థానంలో క్షయ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. గత ఏడాది కొత్తగా 82 లక్షలమంది క్షయ బారిన పడ్డారని పేర్కొంది. ‘టీబీని సమూలంగా అంతం చేయడం అంత సులువు కాదు. ఏటా ఆ వ్యాధికి ఎంతోమంది పేద దేశాల ప్రజలు బలవుతున్నారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి’ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పష్టం చేశారు.
Similar News
News February 6, 2026
రంగులు మారే శివలింగం.. ఎక్కడంటే?

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్‌లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్‌ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.
News February 6, 2026
అద్భుతం.. ఈ నెల 28న గ్రహాల పరేడ్

ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. బృహస్పతి(గురు), బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే దగ్గర కనిపించనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు, బుధుడు, శని గ్రహాలను పశ్చిమ దిశలో టెలిస్కోప్‌తో చూసే అవకాశం ఉంది. వీటికి సమీపంలోనే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడవచ్చు. ఇక బృహస్పతి చంద్రుడి సమీపంలో నేరుగా కనిపించనుంది.
News February 6, 2026
మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.


