News September 10, 2024

‘తుంగభద్ర’ గేట్లు మొత్తం మార్చాల్సిందే: నిపుణుల కమిటీ

image

తుంగభద్ర డ్యామ్ గేట్లను నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని, మరమ్మతులు చేస్తే డ్యామ్‌కే ప్రమాదమని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం 45 ఏళ్లు అని, ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్లను వినియోగించినట్లు పేర్కొంది.

Similar News

News November 25, 2025

ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

image

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.

News November 25, 2025

జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

image

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.

News November 25, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలు

image

<>బల్మెర్ లారీ<<>> 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 19వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. నెలకు రూ.40వేల నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/