News August 23, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన తుంగభద్ర వారియర్స్

image

APL క్వాలిఫయర్-2లో భీమవరం బుల్స్‌పై తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ వైజాగ్‌లో జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. తొలుత భీమవరం ఓవర్లన్నీ ఆడి 183/5 పరుగులు చేసింది. తోట శ్రవణ్ (71*) రాణించారు. అనంతరం 19 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి తుంగభద్ర లక్ష్యాన్ని ఛేదించింది. గుట్ట రోహిత్ (87) విధ్వంసం సృష్టించారు.

Similar News

News August 23, 2025

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

News August 23, 2025

సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.

News August 23, 2025

EP44: ఈ విషయాల్లో సిగ్గు పడకండి: చాణక్య నీతి

image

కొన్ని విషయాల్లో సిగ్గు పడితే జీవితానికే నష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు విషయంలో సిగ్గు పడకూడదు. అప్పు ఇస్తే నిర్మొహమాటంగా అడిగి తీసుకోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో తినే విషయంలో సిగ్గు ఉండకూడదు. ఏదో అనుకుంటారని తినకుండా ఆకలి చంపుకోకూడదు. తెలియని విషయాన్ని తెలుసుకొని జ్ఞానం పొందేందుకు ఇతరులను అడిగి నేర్చుకోవాలి. అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి’ అని పేర్కొంటోంది. #<<-se>>#chanakyaneeti<<>>