News April 29, 2024
తుని రైలు దహనం వైసీపీ కుట్రే: పవన్

AP: 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక YCP కుట్ర ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘YCP నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కాపు యువతను ఎగదోశారు. కిరాయిమూకలతో తునిలో రైలు తగలబెట్టారు. ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారు. నేను ఆవేశంతో మాట్లాడతాను. విధ్వంసం వైపు వెళ్లను. ఏ ఉద్యమమైనా సరిగా చేయకపోతే అమాయకులు బలవుతారు. ఇదే నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News January 8, 2026
సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్?

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని సమాచారం. తెలుగులో ‘రాజాసాబ్’, ‘MSVPG’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండటం ‘పరాశక్తి’కి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ సమస్యతో సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత.. రూల్స్, ప్రాసెస్ ఇదీ

AP పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్ట్-2లో 5(1) ప్రకారం పదేళ్ల వరకు HYD ఉమ్మడి రాజధాని. 5(2) ప్రకారం గడువు ముగిశాక TGకి హైదరాబాద్, APకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్‌కు సవరణ చేసి ‘అమరావతి కేంద్రంగా APకి రాజధాని ఏర్పాటైంది’ అనేది జత చేస్తారు. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత వస్తుంది. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదించగా క్యాబినెట్ అనుమతితో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు.
News January 8, 2026
66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా ఔట్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నేతృత్వంలోని ‘సోలార్ అలయన్స్’ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలు US జాతీయ ప్రయోజనాలకు, ఆర్థిక వృద్ధికి, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ముఖ్యంగా ‘గ్లోబలిస్ట్’ అజెండాలు, రాడికల్ క్లైమేట్ పాలసీల పేరుతో US పన్ను చెల్లింపుదారుల సొమ్ము బిలియన్ల కొద్దీ వృథా అవుతోందని చెప్పుకొచ్చింది.


