News February 23, 2025

టన్నెల్ ప్రమాదం.. బురదతో రెస్క్యూకు అంతరాయం

image

TG: SLBC టన్నెల్‌లో <<15548177>>చిక్కుకున్న<<>> 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 14 కిలోమీటర్ల లోపల బాధితులు ఉండగా బురద, మోకాళ్లలోతు నీళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. NDRF బృందాలు లోపలికి నడుచుకుని వెళ్లి శిథిలాలను తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News January 25, 2026

హృతిక్ రోషన్‌కు ఏమైంది?

image

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.

News January 25, 2026

కోహ్లీకి ఆ సత్తా ఉందని సచిన్ చెప్పారు: రాజీవ్ శుక్లా

image

తన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సచిన్ గతంలో తనతో చెప్పినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. ‘ఓ రోజు నేను సచిన్ ఇంటికి లంచ్‌కు వెళ్లాను. క్రికెట్‌లో మీరు చాలా రికార్డులు సృష్టించారని, వాటిని ఎవరు బ్రేక్ చేయగలరని సచిన్‌ను అడిగా. కోహ్లీకి ఆ సత్తా ఉందన్నారు’ అని రాజీవ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ 100 సెంచరీలు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 85 శతకాలు బాదారు.

News January 25, 2026

FDDIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (<>FDD<<>>I)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ(ఫుట్‌వేర్ టెక్నాలజీ), BTech/BE/ME/MTech, డిప్లొమా(టెక్స్‌టైల్ Engg/టెక్స్‌టైల్ డిజైన్), టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://fddiindia.com/